నవతెలంగాణ-ఘట్కేసర్
మండల పరిధి అంకుషాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ జగద్గిరి ట్టలో పాఠశాలలో 9వజోనల్ స్థాయి క్రీడాపోటీలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం షాట్‌పుట్ అండర్ 14 విభాగంలో కీర్తన (మహేశ్వరం) మొదటిస్థానం, కీర్తన (నల్లకంచె) ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. అండర్ 17 విభాగంలో మమత (నల్లకంచె) మొదటి స్థానం, సుష్మిత (జగద్గిరిగుట్ట) ద్వితీయస్థానంలో నిలిచారు. అండర్ 19 విభాగంలో ఎస్. మహేశ్వరి (నార్సింగ్) మొదటిస్థానం, శ్యామలత (మహేశ్వరం) ద్వితీయ స్థానంలో నిలిచారు. అథ్లెటిక్స్ 800 మీటర్ల పోటీల్లో అండర్ 17 విభాగంలో వర్షిత (కమ్మదానం) మొదటిస్థానం, భానుశ్రీ (జగద్గిరిగుట్ట) ద్వితీయ స్థానం, అక్షిత (జగద్గిరిగుట్ట) తృతీయ స్థానంలో నిలిచారు. అండర్ 19 విభాగంలో హంస (జగద్గిరి గుట్ట) మొదటిస్థానం, అశ్విని (కమ్మదానం) ద్వితీయ స్థానం, నందిని (జగదీర్గుట్ట) తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కో-ఆర్డినేటర్ నాగకళ్యాణి మాట్లాడుతూ.. కీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటి ముందుకు సాగాలని సూచిం చారు. కార్యక్రమంలో యాదాద్రి-భువనగిరి కో-ఆర్డినేటర్ రజిని, ఫీడీలు పాల్గొన్నారు.