మార్కెట్ లో కాలం చెల్లిన శీతల పానీయం…

– ఖంగుతిన్న వినియోగ దారుడు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని అశ్వారావుపేట – సత్తుపల్లి రోడ్ లో గల  ఓ ప్రముఖ కంపెనీకి చెందిన డీలర్ గడిచిన కొద్ది రోజులుగా స్థానిక కూల్ డ్రింక్స్ షాప్స్,పాన్, కిరాణా దుకాణాలకు ఏడాది క్రితమే కాలం చెల్లిన ఓ రకం కూల్ డ్రింక్ బాటిళ్లను ఒకొక్క కేసుకు (కేసుకు 24 బాటిళ్లు ఉంటాయి) నాలుగు చొప్పున పెట్టి దుకాణాలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక భద్రాచలం మార్గంలోని వారాంతపు సంత ప్రాంగణంలో  గల ఓ కూల్ డ్రింక్ షాపులో ఓ వినియోగదారుడు మజా డ్రింక్ ను కొనుగోలు చేయగా ఈ కూల్ డ్రింక్ బాటిల్ పై గతేడాది నవంబర్ 14 వ తేది కే గడువు ముగిసి నట్లు ఉండటాన్ని గుర్తించాడు.దాంతో ఖంగుతిన్న వినియోగదారుడు ఈ విషయాన్ని షాపు నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లగా ఆమె సదరు డీలర్ సరఫరా చేసిన శీతల పానీయాలను పరిశీలించగా ఒకొక్క కేసుకు నాలుగు బాటిళ్లు చొప్పున కాలం చెల్లిన వే ఉన్నట్లు బయటపడింది.ఈ విషయాన్ని సదరు కంపెనీ డీలర్ దృష్టికి తీసుకెళ్లగా తనకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు తెలిసింది. దాంతో సదరు డీలర్ పై ఆమె ఫిర్యాదు చేస్తానని ” చెబుతోంది.కాగా గడువు తీరిన శీతల పానీయాలను సరఫరా చేయడం,సదరు డీలర్ కు ఇది పరిపాటి అని ప్రచారం జరుగుతోంది.గతంలో కుడా ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది.దీనిపై పుడ్ ఇన్స్పెక్టర్  దృష్టి సారించాలని,కాలం చెల్లిన డ్రింక్ ను సరఫరా చేస్తున్న డీలర్ పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. డీలర్ వివరణ : ఆ శీతల  పానీయం మేమే సరఫరా చేసినప్పటికీ ఆ దుకాణం వాళ్ళ వల్లే ఈ తప్పిదం జరిగి ఉండొచ్చు అని,మేము ఎపుడో సరఫరా చేసిన బాటిల్స్ ఇపుడు బయట పెట్టా రేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.కాలం చెల్లిన పానీయాలను మేము సరఫరా చేయడం లేదని అన్నాడు.
Spread the love