నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అవుట్ సోర్సింగ్ ఎ యన్ యం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున అవుట్ సోర్సింగ్ ఎ యన్ యం ల ఉద్యోగ కాలాన్ని పొడిగించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ -సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు తో కలిసి డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాపితంగా 2300 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారనీ వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ,గుర్తింపు కార్డ్స్ ఇవ్వాలని, పి ఎఫ్, ఈ యస్ ఐ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కవిత ,మంజుల ,సంద్య ,తేజ,పద్మ, ప్రశాంతి ,జమునలు పాల్గొన్నారు.