ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీయే 3.0కి ఇది తొలి సెషన్ కావడం గమనార్హం.

Spread the love