2015లో జరిగిన ఘటనకు సారీ చెప్పిన పవన్..

నతెలంగాణ – హైదరాబాద్: నిన్న భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి గురవుతున్నారు. తన ప్రసంగం సందర్భంగా 2015లో తన ఫ్యాన్స్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన గొడవపై పవన్ స్పందించారు. అప్పట్లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పోస్టర్ల వైరం జరిగింది. ఒకరి పోస్టర్లను మరొకరు చింపేసుకున్నారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ఆ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఎవరైనా పొరపాటున పోస్టర్ చింపేసినా దాన్ని క్షమించి, అక్కడితో వదిలేయాలని కోరారు. చిన్నిచిన్ని ఘటనలను పెద్దవిగా మార్చవద్దని విన్నవించారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని చేతులెత్తి వేడుకుంటున్నానని చెప్పారు.

Spread the love