
నవతెలంగాణ – నెల్లికుదురు
పంజాబ్, హర్యానా బార్డర్లో బటిండా జిల్లా ఖనౌరి వద్ద శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతాంగం పై బీజేపీ నాయకత్వంలో కేంద్రం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పోలీసులు రైతులపై రబ్బర్ బుల్లెట్లతొ, టియర్ గ్యాస్ గోళాలతో విచ్చలవిడిగా రైతులపై కాల్పులు చేయడం సరైనది కాదన దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి ఆలకుంట్ల సాయిలు పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు తొట్టి హరీష్ అన్నారు. మండల కేంద్రంలో కిసాన్ మోర్చా ఎస్ కే యం జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతూ శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా జరిపిన కాల్పులతో అనేకమంది రైతులు గాయపడ్డారు అని అన్నారు. అందులో శుభకరన్ సింగ్య అనే యువరైతు మరణించాడు అని తెలిపారు. పోలీసుల పాషవిక చర్యను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కె ఎం జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్ననిరసన కార్యక్రమలలో భాగంగాఈ శుక్రవారం ఏఐకేఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించామని అన్నారు . మోడీ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపడం ద్వారా తన క్రూర స్వభావాన్ని బయటపెట్టుకుందని అన్నారు. రెండు సంవత్సరాల క్రితమే రైతుల డిమాండ్లను పరిష్కరిస్తానని వ్రాత పూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలుపరచకుండా కాలయాపన చేయడం సరైనది కాదని అన్నారు. మళ్లీ తిరిగి చర్చల పేరుతో మభ్యపెడుతుందని ఆవేదన వ్యక్తం చెందారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. లేదంటే రైతన్న ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇప్పటికైనా రైతుల కోసం అర్థం చేసుకొని రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రైతాంగం పై దాడుల ద్వారా అణిచివేయాలని చూస్తూ ఊరుకోమని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా రైతాంగ డిమాండ్లపై కేంద్రం ఇచ్చిన రాతపూర్వ హామీని అమలు చేయాలని రైతాంగం పై దాడులు, మారణకాండను ఆపు చేయాలని, ఖనౌరి కాల్పులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు ఇరుగు నాగన్న ఆశోద యాకూబ్ రామచంద్రు రామయ్య వెంకట్ రెడ్డి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.