ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: పీడీఎస్ యూ

– ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నియంత్రణ చట్టం తీసుకురావాలి: పీడీఎస్ యూ
నవతెలంగాణ-  డిచ్ పల్లి
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్ యూ డిచ్ పల్లి మండల నాయకులు వరుణ్ అన్నారు. గురువారం డిచ్ పల్లి మండల పీడీఎస్ యూ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పుస్తకాలు సకాలంలో ఇవ్వాలని, త్రాగునీరు కొరత లేకుండా చూడాలని,‌ విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, క్లాస్  రూం లు నిర్మించాలన్నారు. ప్రవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు రవీందర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love