– జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు ఏవి రామారావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికెట్‌తో సంబంధం లేకుండా పర్మినెంట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ (పెన్) కార్డు అందజేయనున్నట్టు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏవి రామారావు తెలిపారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయుడి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రతి నెల మూడో శనివారం జరపాల్సి ఉండగా దసరా సెలవలు వలన శనివారం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పిల్లలు చదువు కోసం (డిజిటల్ టెలివిజన్) ద్వారా విద్యా భోధన చేయుటకు ప్రభుత్వం ఆదేశించింతని డిజిటల్ విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క టీవీ రూ.6 లక్షలు చొప్పున మూడు టీవీలు రూ.18 లక్షలు విలువ గల టీవీలు మన పాఠశాలకు అందించినట్టు తెలిపారు. వచ్చే నెల మూడో శనివారం తప్పక ప్రతి విద్యార్థి తమతమ తల్లిదండ్రులను సమావేశంనకు హాజరు పరచాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎంసీ సభ్యులు షేక్ హుస్సేన్ అహ్మద్, సరిత, గ్రామస్తులు కొత్తూరి, సీతారామారావు, ఉపాధ్యాయులు లక్ష్మణ్, సత్యనారాయణ, రామక్రిష్ణ, శర్మ, కోటేశ్వరీ, రజనీ, సరోజిని, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.