పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

– తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌.శ్రీనివాస్‌
– మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రామపంచాయతీ కార్మికు ల 8 నెలల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడినా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వెంటనే ప్రభుత్వం జీపీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ పేచీలో మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపం చాయతీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, నాయకులు కృష్ణ, శ్రీనివాస్‌, సుగుణ, రవి, నరసింహ, శ్రీకాంత్‌, కార్మికులు పాల్గొన్నారు.

Spread the love