బీఆర్ఎస్ హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

  • కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో అధికారంలోకి రావడం ఖాయం..
  •  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో రావడం శుభ సూచకం…
  • పదేండ్లుగా పార్టీ కోసం ప్రశ్నించే గొంతుగా పనిచేస్తున్న నాకు అవకాశం ఇవ్వండి..
  • టీపీసీసీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత
    నవతెలంగాణ మునుగోడు: కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిఆర్ఎస్ ప్రకటించడం మేనిఫెస్టోను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలు లేరు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూన్నా కైలాస నేత అన్నారు.శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశ్నించే గొంతుగా పనిచేసిన బడుగు బలహీన వర్గాలకు చెందిన తమకు అధిష్టానం ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తామని ప్రకటించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను ఓకే సీటు బీసీలకు కేటాయించారు రెండో సీటు తమకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీకి కానుకగా అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
    కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయాలని లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి స్వాగతిస్తున్నామని అన్నారు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లుగా కేసీఆర్ సర్వనాశనం చేసి అప్పుల రాష్ట్రంగా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని నవంబర్ 30తో కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి అరాచకానికి తెర పడుతుందని తెలిపారు గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని బీసీ కోటలో తనకు మునుగోడు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరారు నిరుద్యోగ యువత రైతులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలవనున్నారని పేర్కొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారగొని అంజయ్య, బోయపర్తి లింగయ్య, పన్నాల లింగయ్య యాదవ్, బట్టు జగన్ యాదవ్, బట్టు శ్రీనివాస్ యాదవ్,ఇటుకలపాటి మధు, ఆరేళ్ల సైదులు, కాటం వెంకన్న, దొమ్మాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు..
Spread the love