నవతెలంగాణ-అచ్చంపేట
గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రధానంగా గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సర్పంచ్ పవన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చందాపూర్ గ్రామపంచాయతీలో 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ తిప్పర్తి పవన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో చేపట్టవలసిన పను అభివృద్ధి పనులపై వార్డు సభ్యులతో ప్రజలతో సమీక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరా, మౌలిక వసతులు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ తుమ్మల గణేష్ , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్పెషల్ ఆఫీసర్, గ్రామ ప్రజలు ఉన్నారు.
గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -



