మొబైల్ రైతు బజార్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి…

– జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
మొబైల్ రైతు బజార్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి కోరారు. సోమవారం నాడు కలెక్టరేట్ ఆవరణలో  “మొబైల్ రైతు బజార్” వాహనానికి ఆయన రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలు కూరగాయలు, ఆకుకూరలు కొనడానికి  మొబైల్ రైతు బజార్ సేవలను వినియోగించుకోవాలని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతు నుండి ప్రజల వద్దకు తీసుకొచ్చే మొబైల్ రైతు బజారు సేవలను వినియోగించుకోవాలని, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయ సహకారంతో భువనగిరి రైతు ఉద్యానవన ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారు ఈ మొబైల్ రైతు బజార్ లు నడపడం శుభపరిణామని, అన్నారు. రైతులను భాగస్వాములు చేసి మొబైల్ రైతు బజార్ సేవలను విస్తరించాలని ఆయన అధికారులకు సూచించారు తెలిపారు. మొబైల్ రైతు బజార్ ద్వారా అదనపు కలెక్టర్ స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేశారు. ఈ  కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సి హెచ్ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణభివృద్ది అధికారి నాగిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మీ, మొబైల్ రైతు బజార్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love