సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

– అంగన్వాడీలో కొనసాగుతున్న పొషణ్ మహోత్సవం ఏసిడిపిఓ అరవింద 
నవతెలంగాణ శంకరపట్నం
గర్భిణీలు బాలింతలు చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ గ్రామాలలో ప్రత్యేకఆరోగ్య నిర్వహణ మాత శిశు సంక్షేమపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందనీ ఏసిడిపిఓ అరవింద అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసిడిపిఓ అరవింద హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, నెలలో పోషన్ కార్యక్రమం నిర్వహిస్తారు.గ్రామంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ,అంగన్వాడి సేవలను అర్హులు వినియోగించుకోవాలని, పోషణ ఆహారం పై అవగాహన కల్పించి, ఆ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చిన్నారులకు అక్షరాభ్యాసo,అన్న ప్రసన్న వంటి కార్యక్రమాలు జరిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికోట రమేష్, స్థానిక సర్పంచ్ ,బండారి స్వప్న,మండల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ స్రవంతి, కవిత, మండలంలోని అంగన్వాడి టీచర్లు, కమల, సుమలత, పద్మ, కాంత, సోనీ, రాజేశ్వరి, సుభద్ర, రమ,సాధన ,ఆయా ,మహిళలు ,చిన్నారులు పాల్గొన్నారు.

Spread the love