అధ్యయనానికి ముందే అనుమతులు

Permissions prior to the study– హైడ్రో ప్రాజెక్టుల పర్మిషన్‌పై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
– వ్యతిరేకిస్తున్న పర్యావరణ నిపుణులు
– 2013 చట్టానికి విరుద్ధంగా ఆదేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నదీ పరీవాహక ప్రాంత సామర్థ్యం, ప్రభావ అంచనాపై అధ్యయనాలకు ముందు ప్రతిపాదిత జలవిద్యుత్‌ (హైడ్రో) ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. కాగా, దీనిని పర్యావరణ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే 2013 ఆదేశాల ప్రకారం.. పర్యావరణం, అటవీ క్లియరెన్స్‌ను పరిగణనలోకి తీసుకునేటప్పుడు ప్రాజెక్టు ప్రభావం, దాని సామర్థ్య అధ్యయనాల ఫలితాలను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలతో 2013 నాటి ఆర్డర్‌ను తుంగలో తొక్కినట్టయింది.
”వన్‌ (సంరక్షన్‌ ఏవం సంవర్ధన్‌) అధినియం-1980 కింద అనుమతి మంజూరుకు సమయం తీసుకుంటుంది. కనుక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు (ఎంఇఎఫ్సిసి) శాఖ అటవీ సంరక్షణ విభాగం అధినియం కింద ‘సూత్రప్రాయంగా’ ఆమోదం మంజూరు చేయడాన్ని పరిగణించవచ్చని తెలిపింది. 2013 మే 28 నాటి ఆర్డర్‌ ప్రకారం క్యారీయింగ్‌ కెపాసిటీ స్టడీస్‌ (సీసీఎస్‌), క్యుములేటివ్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ స్టడీస్‌ (సీఐఎస్‌) నిర్వహించాలి. నదీ పరీవాహక ప్రాంతంలోని మొదటి హైడ్రో-ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ మినహా, పైన పేర్కొన్న ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా సీసీఎస్‌, సీఐఎస్‌ వంటి అధ్యయనాలు చేయనవసరం లేని బేసిన్‌, అటువంటి అధ్యయన ఫలిత ఆధారంగా ఒక బేసిన్‌లో ఏదైనా జల విద్యుత్‌ ప్రాజెక్టును చేపట్టడానికి ‘తుది అనుమతి’ మంజూరు చేయబడుతుంది” అని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన నోట్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇది వన్‌ (సంరక్షన్‌ ఏవం సంవర్ధన్‌) అధినియం, లేదా అటవీ సంరక్షణ సవరణ చట్టం 2023 కింద, ప్రత్యేకించి వివిధ నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రతిపాదించిన చిన్న, మధ్యస్థ జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరుకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే, పర్యావరణం, అటవీ క్లియరెన్స్‌ కోసం జలవిద్యుత్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నప్పుడు ప్రాజెక్టు ప్రభావం, పరీవాహక సామర్థ్య అధ్యయనాల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటామని 2013 ఆర్డర్‌ పేర్కొంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ జలవిద్యుత్‌ ప్రాజెక్టులను మంజూరు చేయాలంటే దాని సామర్థ్యం, పర్యావరణ ప్రభావ అధ్యయనాలు తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త ప్రాజెక్టుల మంజూరుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుబాటులో ఉన్న నదీ పరీవాహక అధ్యయనాల వివరాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ ప్రభావ అంచనా విభాగం పంచుకుంటుందని పేర్కొంది. నదీ పరీవాహక ప్రాంతం ప్రభావ అధ్యయనం పర్యావరణ ప్రవాహం, జీవవైవిధ్యం, బురద పారవేసే ప్రదేశాలు, ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ ప్రవాహం, పునరావాసం, పరిహారం వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ 2013లో తెలిపింది.
”ప్రభావ అంచనాను పూర్తి చేయడానికి బేసిన్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల ప్రభావాన్ని పొందుపరచడానికి ఇతర ప్రాజెక్ట్‌ల డెవలపర్‌ బాధ్యత వహించాలి. ఈ షరతు పర్యావరణ అనుమతులు (ఈసీ) ప్రక్రియలో రిఫరెన్స్‌ నిబంధనలు (టీఓఆర్‌) దశలోనే నిర్దేశించబడు తుంది. అటువంటి ప్రభావ అధ్యయనం చేసిన తర్వాత, దానిని నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఏసీ)తో పంచుకోవచ్చు” అని పేర్కొంది. ”జీవవైవిధ్య భాగానికి సంబంధించి ప్రభావ అధ్యయనాన్ని ప్రత్యేక సంస్థల్లో ఒకదాని ద్వారా విడిగా చేయవచ్చు. అటువంటి ప్రాజెక్ట్‌ల కోసం ఈసీ/ ఎఫ్సిపై సిఫార్సు చేస్తున్నప్పుడు, ఈఏసీ/ఎఫ్‌ఏసీ అటువంటి అధ్యయనాల ఫలితాలను పరిశీలిస్తుంది” అని తెలిపింది.
”చట్టం ప్రకారం నదీ పరీవాహక ప్రాంతాల ప్రభావ అంచనా లేకుండా అటువంటి ఏదైనా ప్రాజెక్ట్‌ కోసం సూత్రప్రాయంగా ఆమోదాలు మంజూరు చేయడం వలన విధినిర్వహణను పనికిరానిదిగా చేస్తుంది” అని సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీలో క్లైమేట్‌ అండ్‌ ఎకోసిస్టమ్స్‌కు చెందిన దేబా దిత్యో సిన్హా అన్నారు. ”కార్యనిర్వాహక అధికారి తన అధిక అధికార పరిధి కారణంగా ఈ చర్యలు అల్ట్రా వైర్లు (అధికా రాలకు మించినవి) మాత్రమే కాకుండా, అటవీ సంరక్షణ చట్టం, నిబంధనల ఆదేశాలను కూడా ఉల్లంఘించి, పర్యావరణ భద్రతలను బలహీనపరుస్తాయి” అని అన్నారు.

Spread the love