ప్రభుత్వ ఉపాధ్యాయుడి దాతృత్వం..

– విద్యార్థులకు అట్లాస్ లు పంపిణీ..
నవతెలంగాణ-వేములవాడ : వేములవాడ అర్బన్ మండలం  అనుపురం ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మానువాడ శంకర్  గొప్ప మనసును చాటుకున్నాడు. తన సొంత డబ్బులతో పాఠశాలలో 8,9,10 తరగతి  చదువుతున్న విద్యార్థులకు అట్లాస్ లు  పంపిణీ చేశారు.  అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు వచ్చిన ఐదు కంప్యూటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడదాసు విట్టల్,  జడ్పిటిసి మ్యాకల రవి,  సర్పంచ్  కొండపల్లి వెంకటరమణారావు,   మండల విద్యాధికారి బన్నాజీ, ఎంపీటీసీ శేఖర్, ఎస్ఎంసి చైర్మన్  చిట్ల సునీత,  ఉపాధ్యాయులు కవిత, పద్మ, లక్ష్మి, రజిత, లక్ష్మీనారాయణ, రామ్ గోపాల్, శివాని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్, ఉపాధ్యాయ సంఘ బాధ్యులు చిప్ప యాదగిరి, మాడిశెట్టి మహేష్, పెరుమాళ్ల హనుమాన్లు, అడ్వకేట్ బిరుదుల ప్రవీణ్ , విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love