Thursday, June 4, 2026
E-PAPER
Homeజాతీయంనేపాల్‌ ఆర్‌ఎస్‌పి ఛైర్మన్ లమిచానేతోప్రధాని మోడీ భేటీ

నేపాల్‌ ఆర్‌ఎస్‌పి ఛైర్మన్ లమిచానేతోప్రధాని మోడీ భేటీ

- Advertisement -


న్యూఢిల్లీ : నేపాల్‌లో అధికారంలో ఉన్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఛైర్మన్‌ ‌రబీ లామిచ్ఛనే బుధవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విదేశాంగ శాఖామంత్రి ఎస్‌. జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రిలు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా ఉమ్మడి, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేయాలన్న రబీ ఆకాంక్షను నేను స్వాగతిస్తున్నాను. మా పొదురుగు దేశాల భాగస్వామ్యానికి వస్తే.. నేపాల్‌ ‌మాకు ప్రధాన భాగస్వామి. భారత్‌ – ‌నేపాల్‌ ‌మధ్య ఉన్న ఈ విశిష్టమైన, బహుముఖ సంబంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మేము నేపాల్‌‌లోని కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము’ అని మోడీ ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -