ప్రధాని మోడీ మాన‌సిక ప‌రిస్ధితి స‌రిగా లేదు : భూపేష్ బ‌ఘేల్

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై చ‌త్తీస్‌ఘ‌ఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత భూపేష్ బ‌ఘేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీ ఇటీవ‌ల తన ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆయ‌న ముస్లింలీగ్‌తో అజెండాతో పోల్చార‌ని, ఆపై మంగ‌ళ‌సూత్ర‌, మ‌ట‌న్‌, ఫిష్‌, బ‌ఫెలో, ముజ్రా వంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెప్పారు. త‌న‌ను ప‌ర‌మాత్మ పంపార‌ని ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని, అంటే ఆయ‌న సాధార‌ణ మాన‌వుడు కాద‌ని అర్ధ‌మ‌ని అన్నారు. మోడీ మాట‌లు ఆయ‌న మాన‌సిక స్ధితి కుదురుగా లేద‌ని వెల్ల‌డిస్తున్నాయ‌ని చెప్పారు. రాహుల్ గాంధీ దేశాన్ని రెండు ముక్క‌లు చేసిన నేత మ‌న‌వ‌డని, అయితే మోడీ మాత్రం బిర్యానీ తినేందుకు నేరుగా పాకిస్తాన్ వెళ్లార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. నెహ్రూను అగౌర‌వ‌ప‌రిచి తాను గొప్ప వ్య‌క్తిగా చెలామ‌ణి కావాల‌ని మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. కానీ మోడీకి నెహ్రూతో ఎంత‌మాత్రం పోలిక లేద‌ని స్ప‌ష్టం చేశారు. మోడీ ప‌ది జ‌న్మ‌లు ఎత్తినా నెహ్రూ కాలేర‌ని తేల్చిచెప్పారు.

Spread the love