కోహెడలో ఘనంగా పోచమ్మ బోనాలు 

నవతెలంగాణ – కోహెడ 
మండల కేంద్రంలో మాదిగ కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్బు చప్పుల్లతో  మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకొని అమ్మవారి ఆలయం వరకు చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ ఏడూ వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు సుఖ సంతోషాలతో మెదలాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love