
సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు ములుగు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి గెలుపు ఖాయం అని ఎం ఎల్ సి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పోలపాక శేఖర్, మరపాకల మహేందర్, మడి కంటి రణధీర్, ఈర్ల ప్రశాంత్, కొమ్మల రాజు, చింత అజయ్, గట్ల కిరణ్, వీరికి పోచంపల్లి శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి నాయకునికి సముచిత స్థానం ఉంటుందని సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను మండలంలోని గడపగడపకు వెళ్లి ప్రసారం చేయాలని వారు సూచించారు ,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి జడ్పిటిసి తుమ్మల హరిబాబు వైస్ ఎంపీపీ సూది రెడ్డి లక్ష్మారెడ్డి సమన్యాయ కమిటీ సభ్యులు పిన్నింటి మధుసూదన్ రెడ్డి లకావత్ నరసింహ నాయక్ భూక్య దేవా నాయక్ తలసిల ప్రసాద్ పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ హేమాద్రి మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి బాబర్ తదితరులు పాల్గొన్నారు