బడే నాగజ్యోతికి అడుగడుగునా బ్రహ్మరదం

–  మీ సమస్యల పరిష్కారమే నా కర్తవ్యం 
నవతెలంగాణ-కొత్తగూడ : ఇంటింటి ప్రచారం లో భాగంగా మండలం లోని కొత్తపెల్లి, రౌతుగూడం, పెగడపల్లి, గోవిందాపురం, నీలంపెల్లి, ఎదుల్లపెల్లి, దుర్గారం, ముస్మి, లాడాయిగడ్డ, రామన్నగూడం గ్రామాలలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి కి బతుకమ్మ పాటలు, కోలాటం ఆటలతో మహిళలు, ప్రజలందరు మంగళహారతులతో, పులాభిషేకాలు నిర్వహిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే కర్తవ్యం గా పని చేస్తానని అన్నారు. నా తండ్రి ఉద్యమం లో తుపాకీ పట్టి తిరిగి నేలకొరిగిన గడ్డ కు ప్రజాసేవ చేసేందుకు నేను మీ ముందుకు వస్తున్నానన్నారు. మీ అందరి ఆదరాభిమానాలు, ఆత్మీయ పలకరింపులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని బావోద్వేగానికి లోనై చెప్పారు. ములుగు నియోజకవర్గం లోని ప్రతి రైతుకు భూమి పట్టాలు ఇవ్వడం తో పాటు రైతుబంధు, రైతుభీమా అమలయ్యే విదంగా కృషి చేస్తానన్నారు. ఏజెన్సీలోని గిరిజనతర రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఒడిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ దేసిడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు కొమ్మెనబోయిన వేణు, మండల అధికార ప్రతినిధి బానోత్ జవహర్ లాల్ నెహ్రు లతో పాటు మండల నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామ కమిటి నాయకులు, సోషల్ మీడియా ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love