- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ పూర్ గ్రామ శివారులోని ఓ పామ్ ఆయిల్ తోటలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ ఆధ్వర్యంలో పేకాట స్థావరం పై దాడి నిర్వహించారు. ఈ క్రమంలో 9 మంది జూదరులను అరెస్టు చేసి, పేకా ముక్కలతో పాటు వారి వద్ద నుంచి రూ.64,960, తొమ్మిది సెల్ ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శైలేందర్ పేర్కొన్నారు.
- Advertisement -



