పోలీసు బెల్ట్ షాపు..!

– డబ్బాకొట్టు మాటున మద్యం విక్రయాలు
– ప్రార్థన, ఆటస్థలాల సమీపంలో ఆకతాయిల ఆగడాలు
– పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక నేత వత్తాసు!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఏకంగా పోలీసులే బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పోలీసు నిర్వహిస్తున్న ఈ బెల్ట్‌షాప్‌ జోలికి అటు ఎక్సైజ్‌, ఇటు పోలీసుశాఖలకు చెందిన అధికారులు ఏ ఒక్కరూ వెళ్లకపోవడంతో ఆ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు పెరిగాయి. ఓ వైపు ప్రార్థనాస్థలం, మరోవైపు పార్కు, ఆటస్థలాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బెల్ట్‌షాపు మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నగరంలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తుండటంతో యువత పెడదారి పడుతున్న ఉదంతాలు చూస్తున్నాం. కానీ జనం ఆహ్లాదం కోసం సంచరించే ప్రాంతంలో డబ్బా కొట్టుమాటున పోలీసే బెల్ట్‌షాపు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది.
పోలీసు అనే ధీమా కాబోలు…
పోలీసు అనే ధీమా కాబోలు.. నగరంలోని 14వ డివిజన్‌ గొల్లగూడెం ఈద్గా సమీపంలో పార్కు, ఆటస్థలం దగ్గర ఓ చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేశాడు. పొద్దస్తమానం ఓ చిన్నపాటి కిరాణషాపును నిర్వహిస్తుంటారు. సాయంత్రం అయితే చాలు అక్కడున్న ప్రిజ్‌లోకి బీర్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బా కొట్టుకు ఆనుకొనే మందుబాబుల కోసం ఓ గుడిసె లాంటిది ఏర్పాటు చేసి సిట్టింగ్‌ పెట్టారు. పొద్దస్తమానం సిగరెట్లు, గుట్కాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, తినుబండారాలు అమ్మే ఆ డబ్బాకొట్టు సాయంత్రమైతే రూపం మార్చుతుంది. సాయంత్రం 7 గంటల తర్వాత అస్సలు దందా మొదలవుతుంది. ఊరి బయట కాబట్టి మందుబాబులు ఇక్కడికి చేరుకుని చిత్తుగా మద్యం సేవిస్తారు. గ్రౌండ్‌లో వాకింగ్‌కు కోసం వచ్చే మహిళలు, చిన్నపిల్లలను భయబ్రాంతులకు గురిచేస్తుంటారు.
స్థానిక నాయకుడి వత్తాసు…
అస్సలే పోలీసు…ఆపై డివిజన్‌ ప్రధాన నాయకుడి వత్తాసు…ఇంకేముంది ‘ఆడిందే ఆట…పాడిందే పాట’ అన్నట్టుగా ఆయన బెల్ట్‌షాపు ‘మూడుపువ్వులు…ఆరుకాయల్లా’ సాగుతోంది. తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు అటు పోలీసులు, ఇటు అధికార పార్టీ స్థానిక నాయకునికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఖమ్మంలో ట్రాఫిక్‌ పోలీసుగా పనిచేసిన ఈ బెల్ట్‌షాపు నిర్వాహకుడు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసుకు వీలైనప్పుడు పోలీసు…ఆయన లేనప్పుడు భార్య ఈ బెల్ట్‌షాప్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ బెల్ట్‌షాపు నిర్వహణ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఈద్గాకు వచ్చే భక్తులు, వాకర్స్‌, మహిళలు, స్థానికులు…ఇలా ప్రతి ఒక్కరూ సంబంధిత అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నా డివిజన్‌ నాయకుడు ఈ పోలీసుకే వత్తాసు కొడుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పోలీసు బెల్ట్‌షాపు నిర్వహణకు అడ్డుకట్ట వేయాల్సిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అ ప్రార్థన, ఆటస్థలాల సమీపంలో ఆకతాయిల ఆగడాలు
అ పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక నేత వత్తాసు!

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. ఏకంగా పోలీసులే బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పోలీసు నిర్వహిస్తున్న ఈ బెల్ట్‌షాప్‌ జోలికి అటు ఎక్సైజ్‌, ఇటు పోలీసుశాఖలకు చెందిన అధికారులు ఏ ఒక్కరూ వెళ్లకపోవడంతో ఆ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు పెరిగాయి. ఓ వైపు ప్రార్థనాస్థలం, మరోవైపు పార్కు, ఆటస్థలాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బెల్ట్‌షాపు మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నగరంలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తుండటంతో యువత పెడదారి పడుతున్న ఉదంతాలు చూస్తున్నాం. కానీ జనం ఆహ్లాదం కోసం సంచరించే ప్రాంతంలో డబ్బా కొట్టుమాటున పోలీసే బెల్ట్‌షాపు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది.
పోలీసు అనే ధీమా కాబోలు…
పోలీసు అనే ధీమా కాబోలు.. నగరంలోని 14వ డివిజన్‌ గొల్లగూడెం ఈద్గా సమీపంలో పార్కు, ఆటస్థలం దగ్గర ఓ చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేశాడు. పొద్దస్తమానం ఓ చిన్నపాటి కిరాణషాపును నిర్వహిస్తుంటారు. సాయంత్రం అయితే చాలు అక్కడున్న ప్రిజ్‌లోకి బీర్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బా కొట్టుకు ఆనుకొనే మందుబాబుల కోసం ఓ గుడిసె లాంటిది ఏర్పాటు చేసి సిట్టింగ్‌ పెట్టారు. పొద్దస్తమానం సిగరెట్లు, గుట్కాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, తినుబండారాలు అమ్మే ఆ డబ్బాకొట్టు సాయంత్రమైతే రూపం మార్చుతుంది. సాయంత్రం 7 గంటల తర్వాత అస్సలు దందా మొదలవుతుంది. ఊరి బయట కాబట్టి మందుబాబులు ఇక్కడికి చేరుకుని చిత్తుగా మద్యం సేవిస్తారు. గ్రౌండ్‌లో వాకింగ్‌కు కోసం వచ్చే మహిళలు, చిన్నపిల్లలను భయబ్రాంతులకు గురిచేస్తుంటారు.
స్థానిక నాయకుడి వత్తాసు…
అస్సలే పోలీసు…ఆపై డివిజన్‌ ప్రధాన నాయకుడి వత్తాసు…ఇంకేముంది ‘ఆడిందే ఆట…పాడిందే పాట’ అన్నట్టుగా ఆయన బెల్ట్‌షాపు ‘మూడుపువ్వులు…ఆరుకాయల్లా’ సాగుతోంది. తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు అటు పోలీసులు, ఇటు అధికార పార్టీ స్థానిక నాయకునికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఖమ్మంలో ట్రాఫిక్‌ పోలీసుగా పనిచేసిన ఈ బెల్ట్‌షాపు నిర్వాహకుడు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసుకు వీలైనప్పుడు పోలీసు…ఆయన లేనప్పుడు భార్య ఈ బెల్ట్‌షాప్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ బెల్ట్‌షాపు నిర్వహణ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఈద్గాకు వచ్చే భక్తులు, వాకర్స్‌, మహిళలు, స్థానికులు…ఇలా ప్రతి ఒక్కరూ సంబంధిత అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నా డివిజన్‌ నాయకుడు ఈ పోలీసుకే వత్తాసు కొడుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పోలీసు బెల్ట్‌షాపు నిర్వహణకు అడ్డుకట్ట వేయాల్సిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love