Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలియో చుక్క.. చిన్నారుల జీవితానికి రక్ష

పోలియో చుక్క.. చిన్నారుల జీవితానికి రక్ష

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆ గ్రామ సర్పంచ్ రేఖా పాటిల్ చుక్కల మందు వేసి ప్రారంభించారు. అలాగే మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి గోపి చిన్నారులకు పోలీయో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్స్ పోలియో చుక్కల మందు పిల్లలకు ఆరోగ్యకరంగా ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమాలలో వైద్యురాలు శ్రీలేఖ, అలాగే మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో పాటు గ్రామ ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు గంగాధర్, వైద్య సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -