రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించాలి: జీతేశ్ వి పాటిల్

– జుక్కల్ నియోజకవర్గ ఇంఛార్జి రిటర్నింగ్ అధికారి ( జిల్లా ఎన్నికల అధికారి &  జిల్లా కలెక్టర్) జీతేశ్ వి పాటిల్
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎస్సీ జుక్కల్ నియోజకవర్గం స్థాయి రాజకీయ పార్టీల గుర్తింపు ప్రతినిధులతో బుధవారం నాడు మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్  మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సమయంలో వస్తున్న సమస్యలను తెలపడం తో వాటినిపరిష్కరిస్తామని తెలిపారు. 18 సం” రాలు నిండిన వారిని ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అనంతరం నియోజక వర్గ పరిధిలో ఉన్న 8 మండలాల తాసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు, ఓటర్ జాబితాలను సరిచూసుకోని, సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో 8 మండలాల తాసిల్దార్లు,  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యం.డి ముజీబ్, నయాబ్ తాసిల్దార్ భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్ధవర్ శంకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love