– వినేశ్ పిటిషనుపై ఆగస్టు 16న సీఏఎస్ తీర్పు
పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పిటిషనుపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) సింగిల్ జడ్జి బెంచ్ తన తీర్పును ముచ్చటగా మూడోసారి వాయిదా వేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరి కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేసుకున్నప్పటికీ.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా రజతం పతకం లాగేసుకోవడాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆర్టికల్ 18 ప్రకారం వినేశ్ ఫోగట్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఏఎస్ ప్రత్యేక బెంచ్ వినేశ్ ఫోగట్ సహా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఐఓఏలను వాదనలను వినేసింది. ఆగస్టు 11న తీర్పు రావాల్సి ఉండగా.. తొలుత 13కు వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 16న సీఏఎస్ తన తుది తీర్పు ఇవ్వనుంది.