మోడీ పాలనలో పేదరికం రెట్టింపు

Poverty has doubled under Modi's regime– దేశ సగభాగం జనాభా దారిద్ర రేఖకు దిగువనే..
– శ్రామికుల చట్టాలు పెట్టుబడి
– దారులకు అనుకూలంగా మార్పు
– రంగారెడ్డి జిల్లా కార్యకర్తల శిక్షణా తరగతుల్లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌, వీరయ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో పదేండ్ల మోడీ పాలనలో రెట్టింపు స్థాయిలో పేదరికం పెరిగిందని, దేశ జనాభాలో సగ భాగం దారిద్ర రేఖకు దిగువనే ఉన్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యకర్తల రాజకీయ శిక్షణా తరగతులు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూడు రోజలపాటు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీర య్య ఈ శిక్షణా తరగతులను ప్రారంభించి, బోధించారు. దేశంలో కార్మికు లు ఎదుర్కొంటున్న సమస్యలు, బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక చట్టాలతో భవిష్యత్‌లో కార్మికులకు ఎదురయ్యే ప్రమాదాలపై కార్యకర్తలకు బోధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పెట్టుబడిదా రులకు అనుగుణంగా మార్చి కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నా రన్నారు. కార్మికులకు కనీస వేతనం దినసరి వేతనం రూ. 178 ఉంటే సరిపోతుందని మోడీ కార్మిక చట్టాన్ని అమలు చేస్తూ కార్మిక కుటుంబాల ను అంధకారంలోకి నెట్టి వేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలంటే విద్య, వైద్యం ఉపాధి అవకా శాలు కల్పించకుండా దేశ ప్రజల మధ్య కుల, మత బేధాలు రెచ్చగొడుతూ దాడులకు పాల్పడుతూ దేశంలో బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతుం దన్నారు. పదేండ్ల కాలంలో దేశ సంపదను బడా పెట్టుబడిదారులకు అప్పగించి బీజేపీ దొడ్డి దారిన ఎలక్ట్రోల్‌ బాండ్స్‌ ద్వారా రూ.వేల కోట్లు దండుకుందన్నారు. మరో వైపు దేశంలో ఉన్న అవినీతిపరులకు న్యాయం గా శిక్షించకుండా బీజేపీ కండువా కప్పుకున్న వారిపైన ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ చేస్తోందన్నారు. జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెల వాలని ప్రతిపక్ష పార్టీల వారిపైన ఈడీ లాంటి ప్రభుత్వ అధికారులను ఉప యోగించి తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందికి గురి చేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక స్థానం కూడా గెలవకూడదన్నారు. భువనగిరి పార్లమెంట్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగిర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కార్మికులు కృషి చేయాలన్నారు. పార్లమెం ట్‌లో కార్మిక సమస్యలపై పాలక వర్గాన్ని నిలదీసే బాధ్యతను ఎంపీ అభ్యర్థి జహంగిర్‌ తీసుకుంటాడని తెలిపారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ చైతన్యపరిచి సీపీఐ(ఎం) అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజు, కార్యదర్శి చంద్రమోహన్‌. కోశాధికారి కవిత, ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌, రవికుమార్‌, కీసరి నర్సిరెడ్డి, డి.జగదీష్‌, సహాయ కార్యదర్శులు స్వప్న, బ్రహ్మయ్య, అల్లి దేవేందర్‌, జిల్లా కమిటీ సభ్యులు, సీఐటీయూ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love