– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
బీఆర్‌ఎస్ యువ నాయకులు సంతోష్‌గౌడ్ శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంతోష్‌గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో సీనియర్ నాయకుల సలహా సూచనలతో కాంగ్రెస్ పార్టీకి సైనికుడిగా పనిచేయడానికి సిద్దంగా వున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ యువజన తాండూర్ అధ్యక్షులు కావలి సంతోష్ ఎన్‌ఎస్‌యూఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్, సింగర్ కాంగ్రెస్ నాయకుడు జలాల్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.