Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదింటికల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం

పేదింటికల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
నవతెలంగాణ-వర్ధన్నపేట
ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ రాజ్యంలోనే సొంతింటి కల నెరవేరుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు వర్ధన్నపేట మండలం కడారి గూడెం,కట్ర్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు నూతన ఇండ్ల గృహప్రవేశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట తహసిల్దార్ విజయసాగర్ ఎంపీడీవో వెంకటరమణ, మండల జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్ , పింగిలి రాజ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యం, ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ కౌడగాని రాజేష్ కన్నా, జిల్లా మైనారిటీ నాయకులు చోటు, జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీపాద సతీష్, పోశాల వెంకన్న, కట్ర్యాల ఉప సర్పంచ్ నాంపల్లి రవీందర్, మైనార్టీ నాయకులు అక్బర్ , మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -