- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ జెండాను ఎగురవేశారు.తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్క పౌరుడు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు.నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగిందని,ఇందులో ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, జర్నలిస్టులు,లాయర్లు,ప్రొఫెసర్లు,అధ్యాపకులు, డాక్టర్లు సంబండ వర్ణాలు పాల్గొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



