నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి, గన్నారం సబ్ స్టేషన్, ఇందల్ వాయి33/11కెవి సబ్ స్టేషన్ ల పరిధిలోని పలు గ్రామాల్లో శని వారం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంద ని ఇందల్ వాయి ఏఈ పండరి నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ సిర్నపల్లి, గన్నారం,ఇందల్ వాయి సబ్ స్టేషన్ పరిధిలోని నల్లవెల్లి, స్టేషన్ తండా, డొంకల్, గౌరారం, మేగ్య నాయక్ తండా, గన్నరం,ఇందల్ వాయి, చంద్రయాన్ పల్లి, గంగారం తండా,తిరంగ పేట్ తో పాటు అయా తండాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అయిన వివరించారు. మరమ్మతు పనుల దృశ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏఈ పండరి నాథ్ తెలిపారు. ప్రజలు, రైతులు, వ్యాపారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.