రేపు విద్యుత్ సరఫరా లో అంతరాయం…

Power supply disruption tomorrowనవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని డిచ్ పల్లి ఎడిఈ జీ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33/కెవి ఫిడర్ సిర్నపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని నల్లవెల్లి, మేగ్యనాయక్ తాండ, డోంకల్, కోటల్ పల్లి గ్రామాలకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/ కె వి విద్యుత్ లైన్ మరమ్మతుల దృశ్యా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఇందల్ వాయి టిజీ ఎన్పిడిసిఎల్  ఏఈ పండరి నాథ్, యెల్ల రెడ్డి పల్లి ఏఈ జ్ఞానేశ్వర్  కోరారు.

Spread the love