అచంచలమైన ప్రేరణతో ప్రజయ్ విల్లా ప్లాట్లు 

– అంచనాలకు మించి సరసమైన ధరలకు డ్రీమ్ హోం విల్లా ప్లాట్ లు

– తుక్కుగూడలో 14.5 ఎకరాల వెంచర్ విస్తరణ బ్రోచర్లు ఆవిష్కరించిన ప్రజయ్ ఇంజనీర్స్ చైర్మన్ & ఎండి
నవతెలంగాణ – హైదరాబాద్
నూతనంగా విస్తరించిన వెంచర్లో అచంచలమైన ప్రేరణతో ప్రజయ్ ఇంజనీర్స్ ప్లాట్లను సిద్ధం చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో ప్రజయ్ ఇంజనీర్స్ సంస్థ వారు విస్తరించిన ప్రజయ్ వర్జిన్ కౌంటి నూతన వెంచర్లో గురువారం ప్రీమియం విల్లా ప్లాట్ల బ్రోచర్ ను చైర్మన్ విజయ్ సేన్ రెడ్డి , ఎండి రోహిత్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తుక్కుగూడలో వినియోగదారులకు అందుబాటులో 14.5 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ను విస్తరించామని, సరసమైన ధరలకు విల్లా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగంచుకొని తమ కలలను నిజం చేసుకోవాలని వివరించారు. అనేక సంవత్సరాలుగా ప్రజయ్ ఇంజనీర్స్ సంస్థ తక్కువ ధరలో ప్రజల సొంత ఇంటి కలలను నిజం చేస్తుందని, ఈ అనుభవం నుంచే సరసమైన ధరలకే ప్రజయ్ వర్జిన్ కౌంటి వెంచర్ పేరుతో ప్రీమియం విల్లా ఫ్లాట్లను వినియోగదారులకు అందిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారులను సంతృప్తి పరచడమే తమ లక్ష్యమని వారి యొక్క ప్రేరణతోనే విల్లాల కోసం అన్ని హంగులు ఏర్పాటు చేసి వెంచర్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తమ సంస్థ ఈ వెంచర్ ను ప్రారంభించడం ద్వారా కొత్త ఉత్సాహం పొందుతుందని, వర్జిన్ కౌంటింగ్ ప్లాట్ల వెంచర్ లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా నిర్మించుకునేందుకు ప్రజయ్ సంస్థ ముందుంటుందని వివరించారు. అంచనాలకు మించి వినియోగదారులు తమ సంస్థను ఆదరిస్తున్నారని దానికి తగిన విధంగా సంస్థ వినియోగదారుల కోసం కృషి చేయడానికి అనునిత్యం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ప్రజయ్ వర్జిన్ కౌంటి వెంచర్ ను ఆవిష్కరించడం ద్వారా సంస్థ కొత్త శకానికి స్వాగతం పలుకుతుందని సంస్థ ఎండి రోహిత్ రెడ్డి తెలిపారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు రవికుమార్, సరోజినీ రెడ్డి, సిబ్బంది మరియు వినియోగదారులు పాల్గొన్నారు.
Spread the love