నవతెలంగాణ-వీణవంక: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితెల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నల్ల కొండాల్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే హామీల వెలుగు కృషి చేస్తానని చెప్పారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. పార్టీ లో చేరిన వారిలో దేశాయిపల్లి మాజీ ఉపసర్పంచ్ లు మంద రాజిరెడ్డి, పురం శెట్టి శంకరయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు జున్నూతుల రాజిరెడ్డి, మండల నాయకులు పత్తి సమ్మిరెడ్డి, బుడిగ జంగం మండల అధ్యక్షులు తూర్పాటి కనకయ్య, కొయ్యడ రాములు, కనకం రామయ్య, గోస్కుల అరవింద్, ఆరేపల్లి సదయ్యలతో పాటు సుమారు 150 మందిపైగా కార్యకర్తలు ఉన్నారు.