విశిష్ట సేవలకు ప్రతిభా పురస్కారం..

– ఉత్తమ లయన్స్ క్లబ్ గా బెజ్జంకి
– పురస్కారాలందుకున్న 2022-23 కార్యవర్గ సభ్యులు
నవతెలంగాణ – బెజ్జంకి 
సామాజిక కార్యక్రమాలు ఏర్పాటుచేసి ప్రజలకు అందించిన విశిష్ట సేవలకు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు దక్కాయి. 2022-23 ఏడాదిలో బాధ్యతలు నిర్వర్తించిన లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు ఈ గౌరవం దక్కింది.సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బెజ్జంకి లయన్స్ క్లబ్ కు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు వరించాయి.ఉత్తమ అధ్యక్షుడిగా ఎలుక రవీంద్ర ప్రసాద్,ఉత్తమ కార్యదర్శిగా రాజ్ పురోహిత్ భరత్ సింగ్,ఉత్తమ కోశాధికారిగా బండి వేణు,ఉత్తమ కోర్ కమిటీ సభ్యులుగా నారెడ్డి సుదర్శన్ రెడ్డి,పుళ్లూరీ ప్రభాకర్ ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు.బెజ్జంకి లయన్స్ క్లబ్ గత 16 ఏండ్లుగా విశిష్ట సేవలందిస్తూ ఉత్తమ లయన్స్ క్లబ్  పురస్కారాలు వరించడం అభినంధనీయమని ఎలుక రవీంద్ర ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
Spread the love