అంతర్జాతీయ మత్తుపదార్థాల, అక్రమ రవాణా పై అవగాహన షార్ట్ ఫిలిం ప్రదర్శన

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని పలు గ్రామాలలోని పాఠశాలల్లో అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా పై అవగాహన కల్పిస్తూ షార్ట్ ఫిలిం ద్వారా ప్రదర్శన నిర్వహించడం జరిగిందని  ఎస్ఐ తిరుపతి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, జూన్ 26 న అంతర్జాతీయ మత్తు పదార్థంలో అక్రమ రవాణా దినోత్సవం  ను పునష్కరించుకొని జక్రాన్పల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో అవగాహన ర్యాలీ, వ్యాస రచన, అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని డ్రగ్ వినియోగము అరికట్టుటకు ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యంకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో షార్ట్ ఫిలిం ద్వారా ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు.  కార్యక్రమంలో తహసీల్దార్,  స్కూల్ జాక్రంపల్లి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జక్రాన్పల్లీ పంచాయతీ కార్యదర్శి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love