పొడుగు, ఔషధ మొక్కలు పెంపకానికి ప్రాధాన్యత

 
– ఆసుపత్రుల ప్రాంగణాల్లో మొక్కలు నాటిన సిబ్బంది
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, అమ్మా ఆయుష్ మాన్ మందిరాలు అన్ని ప్రాంగణాల్లో పొడుగు, ఔషధ మొక్కలు నాటాలి అనే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాలకు అనుగుణంగా డి.ఎం అండ్ హెచ్.ఓ భాస్కర్ నాయక్ ఆజ్ఞ మేరకు మంగళవారం అశ్వారావుపేట లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటారు. పొడుగు రకానికి ములగ, చింత, ఉసిరి, కరివేపాకు, వెలగ చెట్టు. ఔషధ విభాగానికి చెందిన తులసి, రణపాల, ఇన్సులిన్ ప్లాంట్, నేల ఉసిరి, తిప్పతీగ అయిదేసి మొక్కలు నాటి నట్లు  సబ్ యూనిట్ ఆఫీసర్ అజ్మీరా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాందాస్,డాక్టర్ దీపక్ రెడ్డి,హెచ్.ఈ విజయలక్ష్మి, హెచ్.ఈ.ఓ రాజు, హెచ్.ఎస్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
Spread the love