గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. 

– తుమ్మల వెంకటరెడ్డి సీపీఎం జిల్లా కార్యదర్శి 

నవతెలంగాణ -ధర్మసాగర్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది పంచాయతీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె మూడో రోజుకు చేరింది. సమ్మెకు సిపిఎం పార్టీ సంఘీభావం ప్రకటించి అనంతరం కార్మికులను ఉద్దేశించి వెంకటరెడ్డి మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులు కెసిఆర్ పాలనలో వెట్టి చాకిరికి గురి అవుతున్నారని పనికి తగ్గ వేతనం లభించడం లేదని ఒకే కార్మికుడు మల్టీపర్పస్ విధానం వల్ల అనేక రకాల పనులు నిర్వహించాల్సి వస్తుందని పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురి అవుతున్న పరిస్థితి ఉందని, ఈ ప్రభుత్వం వీరి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని గ్రామపంచాయతీ కార్మికుల వల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంటున్నాయని పరిశుభ్రతలో మన రాష్ట్రం అనేక అవార్డులు సాధించిన ఘనత ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వల్లనేనని  కానీ వీరికి ఏమాత్రం గుర్తింపు లేదన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల కనుగుణంగా ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి వేతనం నెల కు 19వేల రూపాయలకు పెంచాలని,  వీరికి ప్రమాద బీమా వర్తింపచేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికుల్లో అర్హత ఉన్నవారికి పదోన్నతులు కల్పించాలని వీరి ముఖ్యమైన 17 డిమాండ్లను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సమస్యలు సాధించుకునేంతవరకు ఈ సమ్మెను కొనసాగించాలని ఎవరి బెదిరింపులకు, బుజ్జగింపులకు కార్మికులంతా తలోగ్గకుండా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు గుండు రామస్వామి మరియు పిట్టల అరుణ్ జీవన్ సంజీవ కడారి నాగరాజు గొంది  రాజేష్ గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల నాయకులు దొంగరి ఉప్పలయ్య తండా కుమార్ సూరారపు రాజు సీతయ్య  మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ ల కార్మికులు   తదితరులు పాల్గొన్నారు.
Spread the love