ఆపదలో ఉన్న ఆదివాసి బిడ్డకు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్

– నవ తెలంగాణ కథనానికి భారీ స్పందన
నవతెలంగాణ -మహాముత్తారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన బంధం రవి గత కొన్ని రోజుల నుండి లివర్ కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు ఇతనికి భార్య రజిత ఇద్దరు ఆడపిల్లలు ఒక చిన్న అబ్బాయి ఉన్నారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో మంచానికె పరిమితమయ్యాడు ఆస్పత్రికి వెళ్లి చూపించిన ప్రయోజనం లేకపోవడంతో డాక్టర్ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు దీనితో వారు నిరుపేద కుటుంబం కావడంతో వారి దగ్గర డబ్బులు లేక మళ్లీ తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది వారు నిరుపేద ఆదివాసులు కావడంతో వారు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వారిది అలాగే ఏడ్చుకుంటూ రోజులు గడుపుతున్న సమయంలోనవతెలంగాణ న్యూస్ పేపర్ ద్వారా వారి బాధను తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు వారి ఊరికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చి వారికి 5000 వేల రూపాయల ఆర్థిక సాయం మరియు నిత్యావసర సరుకులు& రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని భరోసా కల్పించారు

Spread the love