విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం కావలసిన పుస్తకాల వివరాలను అందించండి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం  కావలసిన పుస్తకాల వివరాలను త్వరలో అందజేసే విధంగా చూడాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి సూచించారు. బుదవారం యూనివర్సిటీ లోని  సెంట్రల్ లైబ్రరీ నుంచి పరిశీలించారు. సెంట్రల్ లైబ్రరీ లో కాంపిటీటివ్  పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకుని, కావలసిన  కొత్త పుస్తకాలకు ఇండెంట్ను  పంపించి సత్వరమే పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని లైబ్రేరియన్ డాక్టర్ సత్యనారాయణ ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ఆదేశించారు. యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ  సెంట్రల్  లైబ్రరీ వసతులు, అవసరమైన  పుస్తకాల గురించి ఇప్పటికే చర్చించినరని ఎంత మొత్తం అవసరం ఉన్నా యూనివర్సిటీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.లైబ్రరీలో  అవసరమైన  వసతులను, సామాగ్రిని పెంచి  విద్యార్థులలో  పోటీ తత్వాన్ని పెరిగే విధంగా  చర్యలు తీసుకోవాలని   రిజిస్ట్రార్  లైబ్రేరియన్ సత్యనారాయణకు ఆదేశించారు.  సందర్శనలో రిజిస్ట్రార్ తో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ రాజ్ తదితరులు ఉన్నారు.
Spread the love