నవతెలంగాణ ఆర్మూర్
ఆలూర్ మండలం దేగాం గ్రామ సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, ఆలూర్ ఎంపీడీఓ గంగాధర్, మాజీ నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ యాల్ల సాయిరెడ్డి, మాక్లూర్ మాజీ ఎంపీపీ ప్రభాకర్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిట్ వినీత్ పవన్, కౌన్సిలర్ లింబాద్రి, మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ముత్యం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఫతేపూర్ శ్రావణ్, కళ్లెం బోజారెడ్డి, వన్నెల్ కార్తీక్ రెడ్డి, సోమ హేమంత్ రెడ్డి, తంబూరి శ్రీనివాస్, బుస్సాపూర్ శేఖర్, ఫతేపూర్ అశోక్, మాజీ వైస్ ఎంపీపీ మోతే చిన్నారెడ్డి, మాక్లూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్లు రమేష్, సీహెచ్ రాజేశ్వర్, ఆలూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేగాం ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



