ఏఎంసీ ఛైర్మన్ గా నియమాకమైన పులి క్రిష్ణ 

– అవమానాలు..నిరీక్షణ..ఫలితం
– ఊహాతెలిసిన నుండి కాంగ్రెస్ పార్టీనే
నవతెలంగాణ – బెజ్జంకి 
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అండగా ఉంటూ న్యాయం చేస్తుందని మరోసారి నిరూపించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఒకప్పుడు అతనోక సాధారణ కార్యకర్త.కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని తనదైన శైలిలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసాడు. కొంతమంది అయనను సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలున్నాయి.అయిన ఏనాడు తన అత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.కాంగ్రెస్ పార్టీ కనీస మనుగడ లేనిరోజుల్లో రెండు దశాబ్దాల కాలం పాటు మొక్కవొని దీక్షతో పనిచేసాడు.అంచెలంచెలుగా ఎదిగి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశారు.యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలోనే మరో కీలక పదవి వరించడం అతిశయోక్తి .ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికకోసం పనిచేసి గుర్తింపు పొందాడు.ఎన్నో అవమానాలు,అడ్డంకులు ఎదురైనా దీటుగా ఎదుర్కొని నిరీక్షించాడు.తాను ఎదురుచూసిన నిరీక్షణకు దక్కిన పలితమే ఏఎంసీ చైర్మన్.మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామానికి చెందిన పులి క్రిష్ణ బెజ్జంకి మండల ఏఎంసీ చైర్మన్ గా నియమాకమైయ్యాడు.పదవులకు కోసం కాకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తే పార్టీయే సముచిత స్థానం కల్పిస్తుందని నిరూపించాడు పులి క్రిష్ణ.ఏఎంసీ చైర్మన్ గా నియమాకమైన పులి క్రిష్ణకు పార్టీ శ్రేణులు,పలువురు రైతులు అభినందనలు తెలిపారు.
Spread the love