హీరో వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది. ఈ పాటను ఆదివారం అనంత పురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ,'ఈ సినిమా చిత్రీకరణ అనంత పూర్‌లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను. పెదనాన్నని దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ చేశాను. ఆగస్ట్ 7న సినిమా రాబోతోంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని భావిస్తున్నాను అని అన్నారు. ‘కొరియన్ కనకరాజు’లో మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ పాటను అనంతపూర్‌లో రిలీజ్ చేయాలని వరుణ్ చెప్పారు. ఇక్కడి బ్యాక్ డ్రాప్‌తోనే ఈ మూవీని చేస్తున్నాం. డబ్బింగ్ అద్భుతంగా జరుగుతోంది. వరుణ్ డ్యాన్స్ అందరికీ నచ్చుతుందిఅని దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పారు. నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ,' వరుణ్తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాకి తమన్ సంగీతం బిగ్గెస్ట్ అస్సెట్ అవుతుంది. సినిమాలో చాలా సర్ర్పైజ్లు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు సరికొత్త అనుభూతి చెందుతారు అని తెలిపారు.
పక్కా మాస్ ఎలిమెంట్స్
- Advertisement -
- Advertisement -



