మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా. మంచాల లింగస్వామి
నవతెలంగాణ హైదరాబాద్:- మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధమల్ల అంజలీ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా.మంచాల లింగస్వామి హజరయ్యారు
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల గ్రూపు-3 లో ఉన్న మాల మరియు ఇతర 25 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గ్రూపు-3 మొదటి రోస్టర్ పాయింటు 22 వద్ద ఉండడంతో గత సంవత్సర కాలంగా వచ్చిన అనేక ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల మరియు ఇతర 25 కులాలకు ఉద్యోగాలే రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే రోస్టర్ విధానాన్ని సవరించి గ్రూపు-3 మొదటి రోస్టర్ పాయింటును 22 నుండి 16 కి మార్చాలి. మాలలకు 50 లోపు మూడు రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో మాలలందరినీ ఐక్యం చేసి కాంగ్రెసు పార్టీపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాల ప్రజా ఫ్రంట్ వైస్ చైర్మన్ దాసరి విశాల్, ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నే శ్రీధర్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్, అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పుణ్య భానుప్రకాశ్, మాల ప్రజా ఫ్రంట్ కోఆర్డినేటర్ మేసే నాందేవ్, ది నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు తాలూకా రాజేష్, భుజంగ రావు, పెరుమాళ్ల సత్యనారాయణ, సుగుణ, సౌభాగ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు
తక్షణమే రోస్టర్ పాయింట్లు సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



