యుద్ధంపై చర్చలకు సిద్ధమే: పుతిన్

నవతెలంగాణ- కొలంబో: ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.  పుతిన్‌ గురువారం నుంచి రెండు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ వార్తాసంస్థతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ‘‘యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని మేం కోరుకుంటున్నాం. ఉక్రెయిన్‌ విషయంపై సంప్రదింపులకు మేం సిద్ధం. కానీ ఆ చర్చల్లో- మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పుతిన్‌ వివరించారు.

Spread the love