ఉత్తర కొరియాకు పుతిన్..

నవతెలంగాణ – ప్యాంగ్‌యాంగ్‌: దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చిన వేళ.. ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 18 – 19వ తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ప్యాంగ్‌యాంగ్‌ ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి భీకర పరిస్థితుల మధ్య వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Spread the love