ప్రజా ప్రతినిధికి నిలువెత్తు రూపం రాఘవరెడ్డి

– జీవితమంతా నమ్మిన ఆశయం కోసమే పోరాటం
– ప్రజా సమస్యలను తన సమస్యగా భావించిన గొప్ప నాయకుడు
– నేటి యువతరానికి ఆదర్శప్రాయుడు 
– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు  నన్నూరి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నిజమైన ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. అలాంటి నాయకులలో నర్రా రాఘవరెడ్డి  ఒకరు.  ప్రజా ప్రతినిధికి నిలువెత్తు రూపం ఆయనే అని  సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం తిప్పర్తి లో నర్రా రాఘవరెడ్డి భవన్ లో నర్రా రాఘవరెడ్డి  9వ వర్ధంతి సందర్భంగా అయన  చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయనా  మాట్లాడుతూ.. నేటితరం నర్రా రాఘవ రెడ్డి  జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.  ప్రజా ప్రతినిధి అంటే నర్రా రాఘవరెడ్డి లాగా నిబద్ధత కలిగి ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని,  మాటలు చెప్పకుండా, కాలయాపన చేయకుండా ప్రజల కోసం  పనిచేసే విధంగా ఉండాలని అన్నారు. తన జీవితమంతా పోరాటాలతో, సమస్యలతో కూడుకున్నప్పటికీ వడి దుడుకు లేకుండా నమ్ముకున్న ఆశయం కోసం తుద కంట వరకు నిలబడ్డారని కొనియాడారు. ఆయన అధికారులతో చర్చించేటప్పుడు తెలుగు భాషలోనే మాట్లాడేవారని,  వారు కూడా  మాతృభాషలోనే ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పే వారని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి పెద్ద ఉరీ లో  హైస్కూలు నిర్మాణం చేయించారని, మంచినీటి సమస్య, ఆరోగ్య సమస్యలు లేకుండా చూశారని చెప్పారు. ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో  ఎస్ఎల్బీసీ సొరంగంకై సాగిన పోరాటంలో నర్రా రాఘవ రెడ్డి  ప్రముఖులని అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు  కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్భయంగా ఆ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరిన  నాయకుడని అన్నారు. ప్రజా సమస్యలను తన సమస్యగా అనుకొని వారి సమస్యను వెంటనే పరిష్కరించిన మహనీయుడు నర్రా రాఘవరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మన్నెం బిక్షం, మండల కమిటీ సభ్యులు భీమగాని గణేష్, జంజిరాల సైదులు, అకిటి లింగయ్య, పోకల శశిధర్, మంత్రల మంగమ్మ, కోట్ల గోవర్దన్ రెడ్డి, సంకోజు శరత్, మైల సైదులు, భైరు కాశీరాములు, కన్నెబోయిన శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love