Friday, June 5, 2026
E-PAPER
Homeమానవిఅమ్మమ్మల కాలంనాటి రాగి అంబలి ఎంతో ఆరోగ్యం

అమ్మమ్మల కాలంనాటి రాగి అంబలి ఎంతో ఆరోగ్యం

- Advertisement -

ఉదయాన్నే రాగులతో చేసిన అంబలి తాగితే ఎంతో ఆరోగ్యం. ఇప్పుడు సిటీలో రాగులతో అంబలి కాయడం కష్టమే. కొందరు వాళ్ల బిజీ లైఫ్ కారణంగా చేసుకోలేకపోతున్నారు. కొందరికి అంబలి తయారు చేసుకుందాం అనిపించిన తయారీ విధానం తెలియక కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రసహ్యమైన రాగి అంబలి టేస్టీ, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు: 1.5 కప్పులు (మొదట కలపడానికి అర కప్పు, మరిగించడానికి ఒక కప్పు)
పెరుగు: ½ కప్పు
మజ్జిగ కోసం నీళ్లు: ½ కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు: 2-3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)

తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుని, అందులో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. మరో గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో మెల్లగా పోస్తూ కలుపుతూ ఉండాలి. మంటను తగ్గించి, మిశ్రమం చిక్కబడే వరకు సుమారు 4-5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక పాత్రలో అర కప్పు పెరుగు, అర కప్పు నీళ్లు పోసి చిలికి వెన్న తీయని పలచటి మజ్జిగను సిద్ధం చేసుకోవాలి. ఉడికించి చల్లార్చిన రాగి జావలో, సిద్ధం చేసుకున్న మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా అయ్యే వరకు బాగా కలపాలి. చిన్న బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. తయారు చేసుకున్న తాలింపును, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను రాగి అంబలిలో వేసి బాగా కలపాలి. టెస్టీ, హెల్తీ రాగి అంబలి రెడీ. వడ్డించే ముందు ఒకసారి బాగా కలిపి గ్లాసుల్లో పోయండి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -