మళ్ళీ సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హేగ్డే..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌హెగ్డే నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా ఉన్న రాహుల్‌ హెగ్డే సూర్యాపేట ఎస్పీగా వెళ్లారు. ఇప్పుడు జరిగిన బదిలీల్లో యథాస్థానానికి వచ్చారు. అలాగే, ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఉన్న సాదన రష్మి పెరుమాళ్‌ను నార్త్‌జోన్‌ డీసీపీగా బదిలీ చేశారు.

Spread the love