తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ.సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారమే ప్రభుత్వం ఈయన పేరును సూచిస్తూ ఆమోదం కోరకు గవర్నర్ కార్యాలయానికి పంపింది. అయితే గవర్నర్ బిజీగా ఉండటం వల్ల ఆమోదానికి కాస్త సమయం పట్టింది. గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఏజీ నియమకానికి సంబంధించి జీవో 636ను విడుదల చేసింది.
పదేండ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏజీ పదవి కోసం చాలా మంది సీనియర్ న్యాయవాదుల పేర్లు వినిపించాయి. అయనప్పటికి, ప్రభుత్వం గతంలో ఏజీగా పని చేసిన సుదర్శన్ రెడ్డి వైపే మగ్గు చూపింది. 2011లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి హైకోర్టులో సుదర్శన్ రెడ్డి ఏజీగా విధులు నిర్వహించారు. అడ్వకేట్ జనరల్ పదవీ చేపట్టిన తొలి తెలంగాణ న్యాయవాది సుదర్శన్ రెడ్డి కావడం విశేషం. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే నాటికి ఏజీగా ఉన్న సుదర్శన్ రెడ్డి మళ్లీ ఏజీ కావడం గమనార్హం.

Spread the love