నవతెలంగాణ-హైదరాబాద్ : నాలుగై రోజుల పాటు దంచికొట్టాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా జంటనగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం కురుస్తున్నది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సూరారం, బహదూర్‌పల్లి, కూకట్‌పల్లి, నిజాంపేట, ప్రగతినగర్‌లో వర్షం కురుస్తున్నది. అలాగే హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీకాలనీ, సికింద్రాబాద్, నేరెడ్‌మెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, నారాయణగూడ, కాప్రా, మేడ్చల్, కొంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఇదిలా ఉండగా.. రాబోయే మూడోరోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.